వింతల్లోకెల్లా వింత

 

 

 

వింతల్లోకెల్లా వింత

 

 

చరణము సోకినట్టి శిలజవ్వనిరూపగు టొక్కవింత, సు

స్ధిరముగ నీటిపై గిరులు దేలిన దొక్కటి వింతగాని మీ

స్మరణ దనర్చుమానవులు సద్గతి జెందిన దెంతవింత? యీ

ధరను ధరాత్మజారమణ దాశరథీ! కరుణాపయోనిధీ!

 

నీ పాదము సోకి రాయి కాస్తా మనిషిగా మారిపోవడం ఒక వింత. నీ నామము రాసిన రాళ్లు నీటి మీద తేలడం మరో వింత. ఇక నీ నామస్మరణ చేయగానే సద్గతి పొందడం అనేది వింతల్లోకెల్లా వింత.

 

..Nirjara